Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహిళల భాగస్వామ్యంతో విజ్ఞాన రంగం సాధికారతను సాధిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. వైజ్ఞానిక పరిశోధనల్లో మహిళల ప్రమేయం, ప్రాముఖ్యత పెరగడమే సమాజ, శాస్త్ర పురోగతికి ప్రతిబింబమని అన్నారు. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) సమావేశంలో ప్రధాని మోడీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్నారు. సైన్స్, రీసెర్చ్లకు నూతన ఉత్తేజం ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి తీసుకువెళ్లినపుడే ఫలవంతమవుతాయని అన్నారు. ఈ రోజు భారత్ స్టార్టప్‌లలో మొదటి మూడు దేశాల్లో ఒకటని ప్రశంసించారు. 2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 81వ స్థానంలో ఉన్న భారత్... 2022లో 40 స్థానానికి ఎగబాకిందని గుర్తుచేశారు. దేశాన్ని ఆత్మనిర్భర భారత్‌గా మార్చడంలో సైన్స్ ప్రాముఖ్యత ఎంతో ఉందని అన్నారు.
భారత దేశం వైజ్ఞానిక రంగంలో అగ్రదేశాలలో ఒకటిగా దూసుకుపోతుందనీ, రాబోయే 25 ఏండ్లలో భారత్ ఏ స్థానంలో ఉంటుందో అంచనావేయలేమని అన్నారు. దేశానికి సేవ చేయాలనే దఢ సంకల్పంతో పాటు సైన్స్‌పై ఉన్న ఆసక్తిని కూడా జతచేస్తే... అద్భుతమైన ఫలితాలు వస్తాయని సూచించారు.