Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే
- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- కొత్త పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం నూతన పార్లమెంట్ భవనంలో తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచనున్నారు. ఆ తరువాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. రెండో విడతలో పలు బిల్లులకు ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ చేయనుంది.