Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ప్రకటన
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిం చింది. రాష్ట్రంలో 86వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు నేటి అర్ధరాత్రి నుంచి 72 గంటలపాటు సమ్మెకు దిగారు.
విద్యుత్ ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ సమ్మెకు మద్దతు పలుకుతున్నామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదానీ గ్రూప్ ప్రవేశపెట్టిన హేయమైన పన్నాగాలకు మహారాష్ట్ర విద్యుత్ బోర్డు బలవు తోందని, దాంతో సమ్మెకు వెళ్లటం తప్ప కార్మికులకు మరో మార్గం లేదని తపన్‌సేన్ అన్నారు.
మహారాష్ట్ర విద్యుత్ రంగ వ్యాపారంలో సగం వాటాను పొందాలనే లక్ష్యంతో టొరంటో పవర్, టాటా పవర్ అడుగు లు వేస్తున్నాయి. మొత్తంగా విద్యుత్ రంగంపై అన్ని వైపుల నుంచి దాడులు మొదలయ్యాయి. ప్రయివేటీకరణ కొనసాగితే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 2.8 కోట్ల మంది విద్యుత్ వినియోగదార్లు అదానీ కంపెనీ సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. దీనివల్ల ఎంతోమంది రైతులు, గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఐటీయూ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ బోర్డ్ నిర్దేశించిన సగటు టారిఫ్ కన్నా ఎక్కువ అదానీ ఎలక్ట్రిసిటీ టారీఫ్ వసూలు చేస్తుందని తెలిపింది. దీనిని అడ్డుకునేందుకు కార్మికులు, ఉద్యోగు లు ఐక్య సంఘటనగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చారని, వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగటం దారుణమని పేర్కొంది. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు సీఐటీయూ అండగా నిలబడుతుందని తెలిపింది.