Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.19,744 కోట్లు వ్యయం
గోవా ఎయిర్పోర్ట్ కి మనోహర్ పారికర్ పేరు
న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ఆమోదం తెలిపింది. మిషన్‌కు ప్రారంభ వ్యయం రూ.19,744 కోట్లు, ఇందులో అవుట్లే కార్యక్రమం కోసం రూ.17,490 కోట్లు, పైలట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, ఆర్‌అండ్‌డి కోసం రూ.400 కోట్లు, ఇతర మిషన్ భాగాలకు రూ.388 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపింది. ఎంఎన్ఆర్ఈ సంబంధిత భాగాల అమలు కోసం పథకం మార్గదర్శకాలను రూపొందిస్తుంది.
మాజీ రక్షణ మంత్రి, నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మనోహర్ పారికర్‌కు నివాళిగా గోవాలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మోపాకు 'మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మోపా-గోవా'గా నామకరణం చేయడానికి క్యాబినెట్ ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఎస్జెవిఎన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్‌లోని 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఎ) ఆమోదం తెలిపింది.పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్‌కు 2025-26 వరకు రూ.2,539.61 కోట్లతో సెంట్రల్ సెక్టార్ 'బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బైండ్)' పథకాన్ని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఎ) ఆమోదించింది. దేశ జనాభాలో 80 శాతం కంటే ఎక్కువ మందిని కవర్ చేయడానికి ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన ఎఫ్ఎం కవరేజ్ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.