Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వేల మందిని రాత్రికి రాత్రే తరలించొద్దు
- హైకోర్టు తీర్పు నిలిపివేత.. హల్ద్వానీ బాధితుల కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పునరావాసం కల్పిం చాకే ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వాసితులను ఖాళీ చేయించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిం ది. రైల్వే స్థలాల నిర్మాణాలను తొలగించేందుకు చేపట్టిన ప్రయత్నా లను సుప్రీంకోర్టు గురువారం నిలిపే సింది. 50 వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించకూడదనీ, వారి కోసం ఆచరణ సాధ్యమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. వీరందరికీ సంపూర్ణ పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూము ల్లో కొత్తగా ఎటువంటి నిర్మాణాలను చేపట్టరాదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని బన్ భూన్పురలో 29 ఎకరాల రైల్వే భూములో దాదాపు 4,365 ఇండ్లు, కొన్ని మసీదులు, దేవాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను నిర్మించారు. వీటిలో సుమారు 50,000 మంది నివసిస్తున్నారు. ఈ నిర్మాణాలను తొలగించాలని 2013 లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ లైంది. దీనిపై విచారణ జరిపిన ఉత్తరాఖండ్ హైకోర్టు 2022 డిసెం బరులో తీర్పు ఇచ్చింది. రైల్వే భూము లను ఖాళీ చేయాలని తీర్పు స్పష్టం చేసింది. దీంతో అక్కడ నివసిస్తున్న వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమా లను చేపడుతున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలును గురు వారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ అభరు ఎస్ ఓఖా సుప్రీంకోర్టు ధర్మా సనం విచారించింది. ఏడు రోజుల్లో 50 వేల మందిని ఖాళీ చేయించ రాదని పేర్కొంది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేసింది. ''ఈ కేసు మానవీయ కోణంతో ముడిపడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా వారంతా అక్కడే ఉంటున్నారు. 1947 తరువాత కొంత మంది ఈ స్థలాన్ని వేలంలో దక్కిం చుకుని అక్కడ నివాసం ఏర్పరుచు కున్నారు. 60-70 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నవారిని ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదు. ఇలాంటి ఉత్తర్వులను మేం ప్రోత్సహించబోం. వారికి తప్పనిసరిగా పునరావాసం కల్పించాలి.
భూమిపై ఎలాంటి హక్కులు లేనివారికి కూడా పునరా వాసం కల్పించే ఖాళీ చేయించిన సందర్భాలున్నాయి. బాధితులను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్క రించాలి. ఇందులో మొత్తం భూమి రైల్వే శాఖదేనా? ప్రభుత్వానికి ఏమైనా స్థలం ఉందా? అన్న విషయాలపై స్పష్టత ఉండాలి'' అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని జస్టిస్ సంజరు కిషన్ కౌల్ అన్నారు. అక్కడి ప్రజలు అనేక సంవత్సరాలుగా నివసిస్తు న్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయని, ఏడు రోజుల్లో వీటన్నిటినీ తొలగించా లని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అడిషినల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్జి) ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగిం చడం చాలా ముఖ్యమని తెలిపారు. దీనిపై జస్టిస్ కౌల్ స్పందిస్తూ రైల్వేల అవసరాలను గుర్తిస్తూనే, ఈ భూమి లో ఉన్నవారిలో ఎవరు అర్హులు ? ఎవరు అర్హులు కాదు? ఇప్పటికే ఉన్న పునరావాస పథకాలు ఏమిటి? వంటివాటిపై ఆచరణ సాధ్యమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ అవి కోవిడ్ కాలంలో జారీ చేయబడిన ఎక్స్-పార్టీ ఉత్తర్వులని పేర్కొన్నారు. పిటిషనర్లు తమ భూమిని తమదేనని, వారు పునరావాసం కోరలేదని ఎఎస్‌జీ ఐశ్వర్య భాటి అన్నారు. కొంతమంది పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయ వాది కోలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ, స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఈ భూమి పిటిషనర్ల కుటుంబాల వద్ద ఉందని, వారికి అనుకూలంగా అమలు చేయబడిన ప్రభుత్వ లీజులు తమ ఆధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కూడా చాలా మంది పిటిషనర్లు ప్రభుత్వ లీజులను తమకు అనుకూలంగా అమలు చేశారని నొక్కి చెప్పారు. నాజుల్ భూముల్లో చాలా ఆస్తులు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సంజరు కిషన్ కౌల్, ''ఆచరణాత్మక పరిష్కారం'' కనుగొన వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖను కోరారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రైల్వే భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించే ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కావలసి ఉంది. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు.