Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో మూడు చారిత్రక ప్రాంతాల నుంచి జ్యోతి ప్రదర్శన
తిరువనంతపురం: ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) 13వ జాతీయ మహాసభలు శుక్రవారం నుంచి (జనవరి 6,7,8,9) మూడు రోజులపాటు జరగనున్నాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని కా. మల్లు స్వరాజ్యం నగర్లో ఉత్సాహ భరితమైన వాతా వరణంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం మూడు చారిత్రక ప్రదేశాల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జ్యోతి ప్రదర్శన ప్రారంభమై సాయంత్రం గాంధీ పార్క్ వద్ద ముగిసింది. ఈ ప్రదర్శనను వాజాముట్టంలోని కా.అమ్ము అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఐద్వా అఖిల భారత సహాయ కార్యదర్శి పి. సతీదేవి ప్రారంభించారు. గాంధీ పార్క్ వద్ద మహాసభల ఆహ్వాన సంఘం చైర్ పర్సన్ శ్రీమతి దాన్ని అందుకున్నారు.
ఐద్వా మొట్టమొదటి మహాసభ 1986 కేరళలో జరిగింది. మళ్ళీ ఇన్నేండ్ల తర్వాత 13వ మహాసభ ఇక్కడ జరగనున్నది.. ఈ సందర్భంగా గత 12 మహాసభల చిహ్నంగా 12 జ్యోతులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇది కా. శారదమ్మ మెమోరియల్ నుంచి మొదలైంది. ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కె. కె. శైలజ ప్రారంభించారు.
ఫ్లాగ్పోలెట్ మార్చ్ మెడికల్ కాలేజీలోని కాం.దేవకీ వారియర్ మెమోరియల్ నుంచి ప్రారంభమైతే దీనిని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు సుసాన్ కోడి ప్రారంభించారు.
తెలంగాణ నుంచి 42 మంది ప్రతినిధులు ,. .ఏపీ నుంచి 36 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగురాష్ట్రాల వైజాగ్ నుంచి జ్యోతి ని తీసుకొచ్చారు.. తిరువనంతపురం రైల్వే స్టేషన్ లో వలంటీర్లు వారికి ఘన స్వాగతం పలికారు.
మహాసభల షెడ్యూల్
9:30 కు ఐద్వా జెండా ఆవిష్కణ
10:30 ప్రారంభ సభ
11:30 నుంచి 1:30 వరకు వివిధ పోరాట యోధులకు సన్మానాలు, సందేశాలు
1:30 కి క్యూబా మహిళా సంఘ నేత సందేశం