Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వివిధ దేశాల నుంచి మనదేశంలోకి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తించిన కరోనా వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద డిసెంబర్ 24 నుంచి ఈ నెల 3 మధ్య అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వైరస్ వేరియంట్లు బయటపడినట్లు పేేర్కొన్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియట్లేనని వివరించాయి. ఇందులో కొత్త వేరియంట్లేమీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని తెలిపాయి. 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేయగా, 124 మందికి పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నాయి. ఈ 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌బిబి, ఒక శాంపిల్‌లో బిఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు.
గత 24 గంటల్లో 188 కొత్త కేసులు
కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 188 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,554గా ఉన్నాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది.