Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్‌లో శనివారం నుంచి కులాల ఆధారిత సర్వే మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ నెల 21వరకు ఈ దశ కొనసాగుతుంది. మొదటి దశలో రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య లెక్కించి, నమోదు చేస్తారు. రెండో దశలో కుటుంబాల్లో నివసించే వ్యక్తులు, వారి కులాలు, ఉప కులాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 30వరకు రెండో దశ కొనసాగుతుంది. మొత్తంగా సర్వే మే 31తో ముగుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న తన సమాధాన్ యాత్రలో భాగంగా శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ సర్వేతో రాష్ట్రంలో కులాలు, కమ్యూనిటీలపై సవివరమైన రికార్డు వుంటుందని చెప్పారు. వారి అభివృద్ధికి ఇది సహాయపడుతుందన్నారు. రాష్ట్రంలో కులాల వారీగా సర్వే జరగాలన్న అఖిలపక్షం డిమాండ్‌ను గతేడాది జూన్ 2న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.