Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27 నెలల తర్వాత జైలు నుంచి బయటకు
న్యూఢిల్లీ: కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌తో అరెస్టయిన ట్యాక్సిడ్రైవర్ మొహమ్మద్ ఆలమ్ జైలు నుంచి విడుదలయ్యారు. 27 నెలల జైలు జీవితం తర్వాత ఆయన బయటకు వచ్చారు. రాంపూర్‌కు చెందిన ఈయనపై నమోదై న రెండు కేసులలో గతేడాది ఆగస్టు, అక్టోబరులో బెయిలు లభించిన విషయ ం తెలిసిందే. ఐటీ, రాజద్రోహం చట్టాల కింద ఢిల్లీ కేంద్రంగా పని చేసే జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్, మరో ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ ఐ) సభ్యులు అతికూర్ రహ్మాన్, మసూద్ అహ్మద్‌లతో పాటు మొహమ్మద్ ఆలమ్లపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులలో పోలీసులు మొదటగా 2020 అక్టోబర్ 5న మొహ మ్మద్ ఆలమ్నే అరెస్టు చేశారు. యూపీలోని హత్రాస్‌లో సామూహిక లైంగిక దాడికి గురై చనిపోయిన దళితురాలి ఇంటికి కప్పన్‌తో పాటు మరో ఇద్దరు వెళ్తున్న సమయంలో ట్యాక్సీని ఆలమ్ నడుపుతున్నారు. అయితే, వారు బాధి తురాలి ఇంటికి చేరుకునేలోపే యూపీ పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు.