Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కులపై చేసిన కృషికి ప్రతీకారం : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ
న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన జర్నలిస్టు రూపేశ్ కుమార్ సింగ్‌పై తప్పుడు కేసులు బనాయించారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ తెలిపింది. మానవ హక్కులపై ఆయన చేసిన కృషికి ప్రతీకారంగా ఆయనపై ఈ తప్పుడు కేసు పెట్టారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ అన్నారు. ఆయన జైలులోనే ఉన్నందున ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చన తెలిపారు. మావోయిస్టులకు నిధులు సమకూర్చాడన్న ఆరోపణలపై ఇండిపెండెంట్ జర్నలిస్టు అయిన రూపేశ్ కుమార్ సింగ్‌ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. భారత ప్రభుత్వానికి గత 26న ఆమె రాసిన లేఖను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం బహిర్గతం చేసింది. రూపేశ్ కుమార్ తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడనీ, మానసిక ఒత్తిడి కారణంగా అది తీవ్రమవుతుందని యూఎన్ మానవ హక్కుల ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.