Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్: తమ శాఖల్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను స్వీకరిస్తున్నట్లు సిటీ యూనియన్ బ్యాంక్ (సియుబి) వెల్లడించింది. సరికొత్త ఇ- ఫైలింగ్ పోర్టల్ టిన్ 2.0 సాంకేతిక అనుసంధా నం ద్వారా ఈ సేవలను అందు బాటులోకి తెచ్చినట్లు ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందు కోసం ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌తో అనుసంధానం అయినట్లు పేర్కొంది. ఇకపై యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు తమ వ్యక్తిగత, కార్పొరేట్ పన్నులను చెల్లించడానికి వీలుందని వెల్లడించింది. ఈ సేవలు అందించే కొన్ని ప్రయివేటు బ్యాంక్‌ల్లో తమకు ఈ అవకాశం దక్కినట్లు పే ర్కొంది. సియుబి శాఖలను సంప్రదించడం ద్వారా గానీ లేదా నెట్ బ్యాంకింగ్, మొ బైల్ బ్యాంకింగ్ ద్వారా సరళమైన ప్రక్రియ ద్వారా పన్ను చెల్లింపులు చేయవచ్చు.