Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతాయి : ఎస్ఎఫ్ఐ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలోని ఎస్ఎఫ్ఐ నిరనసలు చేపట్టింది. ఈ సందర్భంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలో వర్సిటీలోని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్సిటీ కార్యదర్శిని ఎస్ఎఫ్ఐ నాయకుల బృందం కలిసింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తేయటంతోపాటు, మరికొన్ని డిమాండ్ల పై చర్చించినట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సృజన్ భట్టాచార్య తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు బేషరతుగా క్షమాపణలు చెబితేనే సస్పెన్షన్ ఎత్తేస్తామని విశ్వభారతి వర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శనలో విద్యార్థుల పాదయాత్ర శాంతినికేతన్ పోస్టాఫీస్ జంక్షన్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం విశ్వ భారతి వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎదుట బైఠా యించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొ న్నారు. నిరసన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్షు డు ప్రతీక్ ఉర్ రెహమాన్, ఇతర నాయకులు పాల్గొ న్నారు. విద్యార్థుల సస్పెన్షన్పై బిశ్వాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలోని విద్యావ్యవస్థపై దాడి చేసింది. విశ్వభారతి అందుకు భిన్నంగా లేదు. ఈ వైస్ ఛాన్స్లర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మేం ఇదే విషయాన్ని గమనిస్తున్నాం. నిరసనకు దిగే విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆరుగురుని సస్పెండ్ చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేదంటే విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతుంది' అని అన్నారు.