Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ, ఆప్ బాహాబాహీ
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలు వాయిదాపడ్డాయి. తొలి సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, కుర్చీలు విసిరేసుకోవడంతో ఎన్నికలను వాయిదా వేసినట్టు ఎంసీడీ సీనియర్ అధికారి తెలిపారు. శుక్రవారం నాటి సమావేశంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంది. సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని తాత్కాలిక స్పీకర్గా నియమించాల్సి ఉండగా, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జివికె సక్సేనా నియమించడంపై ఆప్ సభ్యులు ఆందోళన చేశారు. కౌన్సిలర్ల కంటే ముందుగా ఎల్జి సిఫార్సు చేసిన నామినేటెడ్ సభ్యులతో తాత్కాలిక స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో సమావేశం వాయిదా పడింది.