Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా శ్రామిక శక్తికి అనుకూల నగరాల్లో..
- పూణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి తర్వాతి స్థానాల్లో..
న్యూఢిల్లీ : మహిళా శ్రామిక శక్తిని అనుకూలమైన నగరాల్లో మొదటిస్థానంలో చెన్నై నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా పూణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబయిలు నిలిచినట్టు ఓ అధ్యయనంలో తేలింది. భారత్లోని పదిలక్షలకు పైగా జనాభా కలిగిన ప్రధాన నగరాలపై ఈ సర్వే చేపట్టింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 14వ స్థానంలో నిలిచింది. జీవన సౌలభ్యం, భద్రత, మహిళల ప్రాతినిథ్యరేటు, మహిళా సాధికారత కార్యక్రమాలు అనే ఐదు అంశాల ఆధారంగా అవతార్ అనే సంస్థ ఈ సర్వేను చేపట్టింది. వివిధ సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఎంతవరకు సౌలభ్యతను అందిస్తున్నాయనే అంశంపై కూడా సర్వే చేపట్టారు.లక్ష కన్నా తక్కువ జనాభా కలిగిన చిన్న నగరాల్లో తమిళనాడులోని ఐదు నగరాలైన తిరుచిరాపల్లి, వెల్లోర్, ఈరోడ్, సేలం, తిరుప్పూర్లు అత్యున్నత స్థానంలో నిలిచాయి. మొత్తం టాప్ 25 రాజధానుల్లో కేవలం పది మాత్రమే అనుకూలమైన నగరాలుగా స్థానం సంపాదించాయి. సాధారణంగా రాష్ట్ర రాజధానులపై ప్రభుత్వాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా, అభివృద్ధి పరంగా ప్రత్యేక శ్రద్ధను చూపుతారని.. అలాంటి రాజధానులు మహిళలకు భధ్రత కలిగించడంపై ఎదురవుతున్న సమస్యలపై దష్టి సారించాలని నివేదిక పేర్కొంది. మొత్తం మీద ఉత్తరాది నగరాల కన్నా దక్షిణాది నగరాలు మెరుగ్గా ఉన్నాయని సర్వే పేర్కొంది.