Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా మహాసభలో నాయకుల పిలుపు
ఐద్వా ఏర్పడి 40 ఏండ్లు అవుతున్నది. 75 ఏండ్ల స్వాతంత్య్రం, 40 ఏండ్ల మన ఉనికిని గుర్తు చేసుకుంటూ ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. బీజేపీ వచ్చిన తర్వాత మతం పేరుతో దాడులు పెరిగాయి. వారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం చరిత్రను సైతం వక్రీకరిస్తున్నారు. ప్రజలను తమ మాటలతో మతం మత్తులో ముంచేస్తున్నారు. ముస్లింల పట్ల వ్యతిరేకత పెంచుతున్నారు. మరోపక్క ప్రజలపై ఆర్థిక భారం పెరిగింది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో మాత్రం మోడీకి వ్యతిరేకంగా మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేశారు. ఇందులో ఐద్వా పాత్ర కీలకం.
తిరువనంతపురం, ఎం.సి.జోసెఫిన్ నగర్ నుంచి సలీమ
తిరువనంతపురంలో జరుగుతున్న ఐద్వా 13వ జాతీయ మహాసభలు రెండో రోజు (శనివారం) ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి. సెషన్ ప్రారంభానికి ముందు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ స్థానిక భాషలో ఉద్యమ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రతినిధులను ఉత్సాహపరిచారు. అనంతరం జాతీయ కార్యదర్శి ప్రవేశ పెట్టిన జాతీయ, అంతర్జాతీయ రాజకీయ రిపోర్టుపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె నాగలక్ష్మి, రత్నమాల, ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు సి.హెచ్.రమణి, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిలక్ష్మీ చర్చల్లో పాల్గొన్నారు.
సామ్రాజ్యవాదంపై వ్యతిరేకత పెరుగుతోంది : మరియం ధావలె
కరోన సమయంలో 11 కోట్ల 40 లక్షల మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. అందులో మహిళల సంఖ్య చాలా ఎక్కువ. ఇటీవల కాలంలో పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల్లోనూ మహిళలు పితృస్వామ్య వ్యవ స్థపై పోరాటం చేయడం గొప్ప విషయం. ము ఖ్యంగా ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే లాటిన్ అమెరికా దేశాలైన వెనుజులా, చిలీ, బ్రెజిల్, బొలీవియా దేశాల్లో వామపక్షాలు అధికారం లోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా సామ్రా జ్యవాదం పట్ల వ్యతిరేకత ఎక్కువయిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ధావలె తెలిపారు. రాజకీయ నివేదికపై 35 మంది చర్చల్లో పాల్గొన్నారు.
మరింతగా ఉద్యమించాలి
ఐద్వా ఏర్పడి 40 ఏండ్లు అవుతున్నది. 75 ఏండ్ల స్వాతం త్య్రం, 40 ఏండ్ల మన ఉనికిని గుర్తు చేసుకుంటూ ఈ మహా సభలు జరుపుకుంటున్నాం. బీజేపీ వచ్చిన తర్వాత మతం పేరుతో దాడులు పెరిగాయి. వారి అధికారాన్ని కాపాడు కోవడం కోసం చరిత్రను సైతం వక్రీకరిసు ్తన్నారు. ప్రజలను తమ మాటలతో మతం మత్తులో ముంచే స్తున్నారు. ముస్లింల పట్ల వ్యతిరేకత పెంచు తున్నారు. మరోపక్క ప్రజలపై ఆర్థిక భారం పెరిగింది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో మాత్రం మోడీకి వ్యతిరేకంగా మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేశారు. ఇందులో ఐద్వా పాత్ర కీలకం. అలాగే కరోనా సమయంలో పేదలందరికీ 10 కేజీల బియ్యం ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం. అయితే కేంద్రం 5 కేజీలు మాత్రమే ఇచ్చింది. అది కూడా అందరీకీ దక్కలేదు. ఒడిశా వంటి రాష్ట్రంలో ఒక్కపూట మాత్రమే తింటున్నారు. మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కావడంలేదు. అలాగే బాల్య వివాహాలకు, మనువాదానికి వ్యతిరేకంగా మన పోరాటాలు మరింత తీవ్రతరం కావాలి. అలాగే అందరిలాగే మహిళలకు కూడా నచ్చినట్టు జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం మన హక్కును కాలరాస్తున్నది. ఈ సమస్యలన్నింటిపై ఈ మహాసభల్లో చర్చింది మన భవిష్యత్ ఉద్యమాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా కులదురహంకార హత్యలు, గృహహింసపైన, యువతులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలి.
వామపక్ష , పెట్టుబడి దారి దేశాల మధ్య తేడా కరోనా సమయంలో ప్రపంచానికి స్పష్టంగా అర్థమయింది : సాయిలక్ష్మీ, ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు
కోవిడ్ సమయంలో తాము అగ్ర స్థానంలో ఉన్నామని చెప్పుకునే దేశాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశ ప్రజలకు సరైన వైద్యం అందించడంలో వెనకబడ్డాయి. వామపక్ష దేశాలు మాత్రం దానికి భిన్నంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాయి. వామపక్ష దేశాలకు, పెట్టుబడి దారి దేశాలకు మధ్య వున్న తేడా కరోనా సమయంలో ప్రపంచానికి స్పష్టంగా అర్థమయింది.
ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని అడ్డుకున్న ఐద్వా : సి.హెచ్.రమణి, ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు
కోవిడ్ సమయంలో దేశంలో మహిళలపై హింస విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ ప్లాంట్ అమ్మకం పెద్ద సమస్యగా వుంది. దీనివల్ల వేల కుటుంబాలు రోడ్డున పడుతాయి. అందుకే ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ఐద్వా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
పోరాటాల్లో మహిళల పాత్ర పెరిగింది : విజూ కృష్ణన్, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి
2014లో మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు. కాని ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. దాడులు మరింత పెరిగాయి. మహిళలకు రక్షణ కరువయింది. అలాగే వ్యవసాయంలో మహిళల శ్రమ ఎక్కువ శాతంలో వుంది. వీరి శ్రమకు గుర్తింపు లేదు. అసలు మహిళలను రైతులుగానే గుర్తించడం లేదు. అందుకే భూమికి జాయింట్ పట్టాలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. మరో పక్క మహిళలు ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొన్నటి రైతు పోరాటమే దీనికి నిదర్శనం. రాబోయే రోజులో ఈ సంఖ్య మరింత పెరగాలి. భవిష్యత్‌లో విద్యార్ధి, యువత, ఐద్వా అందరం కలిసి ఐక్య పోరాటాలు చేస్తేనే దేశాన్ని కాపాడుకోగలం.
విధానాలు మారకుండా న్యాయం జరగదు విజయరాఘవన్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు
దేశ వ్యాప్తంగా సుమారు 57 లక్షల మంది వ్యవసాయ కార్మికులుంటే అందులో 45 లక్షల మంది మహిళలే వున్నారు. అంటే మహిళల పాత్ర ఇందులో కీలకమయింది. మా సంఘంలో కూడా 20శాతం మంది మహిళలు వున్నారు. 23వేల స్థానిక కమిటీలు వుంటే ప్రతి కమిటీకి అధ్యక్షులుగానో, కార్యదర్శిగానో మహిళలు వున్నారు. అంటే మహిళలు నాయకులుగా ముందుకు వస్తున్నారు. ఇది మరింత పెరగాలి. ప్రస్తుతం దేశాన్ని కులం, ప్రాంతం పేరుతో విభజిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దళితులు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. పాలకుల విధానాలు మారకుండా మనకు న్యాయం జరగదు. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిద్దాం.
అలరించిన ఎగ్జిబిషన్
మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అలరిస్తున్నది. అందులో స్ఫూర్తిదాయక మహిళల చిత్రపటా లతో పాటు, చట్టాలు అవి ప్రారంభ మైన సంవత్సరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రతి నిధుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది.
హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళలకు అభినందనలు...
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆ దేశ మహిళలకు అభినం దనలు. అలాగే లాటిన్ అమెరికా దేశాల్లో వామ పక్షాలు అధికారంలోకి రావటం మనకెంతో స్ఫూర్తి దాయకం. నిత్యావసరాల ధరలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. మహిళలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది. తినటానికి తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. యూరోపియన్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం పెరగ డంతో ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. దీని ప్రభావం మన దేశంపై కూడా పడింది. తెలంగాణలో డ్రగ్స్ మాఫియా వల్ల మాదకద్రవ్యాల వినియోగం బాగా పెరి గింది. దాంతో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
- నాగలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు
అమ్మాయిలపై దాడులు పెరిగాయి
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాయిలకు, మహిళలకు రక్షణ కరువైంది. దేశవ్యాప్తంగా దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయి. తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న నూతన విద్యా విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది. అమ్మాయిలను విద్యకు దూరం చేసే ఓ ప్రణా ళికను మోడీ ప్రభుత్వం రూపొందించింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా వుంది.
- మయూక్ బిశ్వాస్, ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ
దేశంలో రెండవసారి అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం కులం, మతం వంటి సెంటి మెంట్‌ను వాడుకుం టున్నది. రాష్ట్రంలో అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలబడతామని చెబుతున్నది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కులదురహంకార హత్యలు బాగా పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఐద్వా పనిచేస్తున్నది. అలాగే చాగంటీ, గరికపాటి లాంటి వాళ్ళు తమ ప్రవచనాల్లో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటిపై అవగాన కల్పించేందుకు ఐద్వా ఆధ్వర్యంలో కాలేజీల్లో అమ్మాయిలకు సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాం.
- రత్నమాల, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పుస్తకావిష్కరణలు
- ''ఆన్ ఆలిండియా ఉమెన్స్ ఆర్గనైజేషన్ టేక్స్ షేప్''.. ఇందులో ఐద్వా మొదటి, రెండో మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచారు. దీన్ని ఐద్వా నాయకులు అర్చనాప్రసాద్, ఛాయ, మినతి, విమల ఆవిష్కరించారు.
- ''గుమ్ నామ్ వీరంగనాయి'' అనే హిందీ పుస్తకం. దీన్ని మంజీత్, చంద్రకళ ఆవిష్కరించారు.
- ''ఎర్లీ స్ట్రగుల్ ఫర్ లా రిఫామ్: డౌరీ అండ్ రేప్'' అనే పుస్తకాన్ని సతీ, సుధ ఆవిష్కరించారు.
- అలాగే చింత పబ్లికేషన్ వారు 30 మంది మహిళా నాయకుల జీవితాలతో తీసుకొచ్చిన మలయాళ సంపుటిని బృందా కరత్ ఆవిష్కరించారు.