Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిసెంబర్లో కేంద్రం చేపట్టిన 24వ విడత ఎన్నికల బాండ్ల పథకంలో రూ.232.10 కోట్లు విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయని ఎస్బీఐ వెల్లడించింది. బాండ్ల అమ్మకాలు అత్యధికంగా ముంబయి నుంచి ఉన్నాయని తెలిపింది. ఆయా రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల్ని న్యూఢిల్లీలో నగదుగా మార్చుకున్నాయని ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఎస్బీఐ తాజా సమాచారాన్ని విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం, గత ఏడాది డిసెంబర్ 5 నుంచి 12 మధ్య దేశవ్యాప్తంగా ఎస్బీఐ ప్రధాన శాఖల్లో ఎన్నికల బాండ్ల అమ్మకాల్ని కేంద్రం ప్రారంభించింది. గుజరాత్ ఎన్నికల పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే, మరోవైపు బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి.
మొత్తం రూ.232 కోట్ల విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయి. ఇందులో రూ.114 కోట్లు ఒక్క ముంబయి నగరం నుంచి వచ్చాయి. ఆ తర్వాత అత్యధికంగా రూ.56 కోట్లు హైదరాబాద్, చెన్నై నుంచి రూ.30 కోట్లు విరాళాలుగా అందాయి. న్యూఢిల్లీ ఎస్బీఐ శాఖలో రూ.16.10 కోట్లు, కోల్కతాలో రూ.16 కోట్లు విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయి. మొత్తం విరాళాల్లో రూ.194 కోట్ల రూపాయల్ని ఆయా పార్టీలు న్యూఢిల్లీలోని తమ ఖాతాల్లో నగదుగా మార్చుకున్నాయి. మోడీ సర్కార్ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో తీసుకొచ్చింది. ఇప్పటివరకూ 20,734 బాండ్లు అమ్ముడుపోయాయి. తద్వారా ఆయా రాజకీయ పార్టీలకు రూ.11,699 కోట్లు విరాళాలుగా అందాయి. హైదరాబాద్ నుంచి రూ.2030 కోట్లు విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయి.