Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలితీవ్రత
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఢిల్లీలో శనివారం రోజు 2.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేస్తున్నది. తీవ్రమైన చలి కారణంగా... 36 రైళ్లు గంట నుంచి ఏడుగంటల ఆలస్యంగా నడవనున్నాయని రైల్వే అధికారి వెల్లడించారు. దట్టమైన పొగమంచు వల్ల ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 25 మీటర్లు, నైరుతి ఢిల్లీలోని పలంలో 50 మీటర్ల దృశ్యమాన స్థాయిని నమోదు చేసినట్టు ఐఎండీ పేర్కొంది. అలాగే ఢిల్లీలోని లోధి రోడ్లో 2, అయనగర్ 3.4, రిడ్జ్ వాతావరణ కేంద్రం 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.