Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ విధానాలకు వ్యతిరేకంగా మహిళలంతా ఉద్యమిద్దాం
- ట్రాన్స్ జెండర్లకు ఐద్వా సభ్యత్వం...
తిరువనంతపురం: మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి మహిళలంతా కలికట్టుగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ పిలుపునిచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న 13వ ఐద్వా మహసభలో మాట్లాడారు. ఐద్వాలో ట్రాన్స్ జెండర్లకు సభ్యత్వం కల్పించేలా నిబంధనలను సవరించారు. ఈ మేరకు ఐద్వా రాజ్యాంగానికి ఆ సంఘ జాతీయ నాయకులు సుభాషిణి ఆలీ ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. 15 సంవత్సరాలు అంతకు మించి వయసు ఉన్న మహిళ, లేదా ట్రాన్స్ జెండర్లు ఐద్వా లక్ష్యాలను ఆమోదించి, నిర్దేశించిన రుసుం చెల్లిస్తే వారికి సభ్యత్వం ఇయ్యవచ్చని సవరణలో పేర్కొన్నారు.
అంకితభావంతో సేవలందిస్తున్న వాలింటీర్స్
ఐద్వా 13 అఖిల భారత మహాసభల్లో కేరళ ఎస్.ఎఫ్.ఐ మహిళా వాలింటీర్స్ అంకిత భావంతో సేవలందిస్తున్నారు. అందరూ ఐద్వా లోగోతో ముద్రించిన తెల్లటి టీ షర్టులు ధరించి ప్రతినిధులను అపురూపంగా చూసుకుంటున్నారు. 850 మంది ప్రతినిధులకు చిన్న ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో సహకరిస్తున్నారు. మహాసభ విజయవంతంగా కొనసాగడంలో వీరి పాత్ర కూడా చాలా వుంది. ఎస్.ఎఫ్.ఐ గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ నుంచి 25 మంది, డీ.వై.ఎఫ్.ఐ నుంచి 20 పని చేస్తున్నారు.
స్ప్ఫూర్తిదాయకంగా .....
మహాసభలో ప్రతినిధిగా పని చేయడం చాలా సంతోషంగా వుంది. మహిళా సమానత్వం కోసం పని చేస్తున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సేవలు అందించడం గర్వంగా అనిపిస్తుంది. బృ ందాకరత్, మాలినీ భట్టాచార్య, మరియం ధావలే వంటి గొప్ప నాయకులను కలవడం స్ఫూర్తి దాయకంగా వుంది.
- ప్రియాంక, తిరువనంతపురం ఎస్.ఎఫ్.ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్