Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో ఒక చర్చికి ఆనుకొని ఉన్న శ్మశానంలో ఘటన
ముంబయి : మహారాష్ట్రలోని ముంబయి నగరంలో సంఘ విద్రోహ శక్తులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశాయి. సబర్బన్ మహిమ్లో గల ఒక చర్చికి ఆనుకొని ఉన్న శ్మశానంలోని సమాధులు, శిలువలను గుర్తు తెలియని ఒక వ్యక్తి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. పోలీసులు, చర్చి ఉద్యోగులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సెయింట్ మైఖేల్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం చర్చి ఉద్యోగులు 18 శిలువలు పగిలిపోయినట్టు గుర్తించారు. ఉదయం సమయంలో చర్చిలోకి ప్రవేశించిన దుండగుడు శ్మశానంలోని 18 శిలువలను ధ్వంసం చేశాడని చర్చి ఒక ప్రకటనలో పేర్కొన్నది.