Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణం చేయించారు. సోలన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ధనిరామ్ షాండిల్ తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రా నుంచి చరదర్ కుమార్, సిర్మౌర్ నుండి హర్షవర్ధన్ చౌహాన్, కిన్నౌర్నుండి జగత్సింగ్ నేగి, సిమ్లా నుంచి విక్రమాదిత్య సింగ్, అనిరుధ్ సింగ్, రోహిత్ ఠాకూర్ ఉన్నారు.
అలాగే సుందర్ సింగ్ ఠాకూర్, మోహన్‌లాల్ బ్రాక్తా, రామ్ కుమార్ చౌదరి, ఆశిష్ బుటైల్, కిషోరి లాల్, సంజరు అవస్తీలను ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లిన సుఖు మూడు రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 68 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్‌కు మొత్తం 40 మంది శాసనసభ్యులు ఉన్నారు.