Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలను, నలుగురు వ్యక్తులను ఉగ్రవాద జాబితాలో చేరుస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ సంస్థల, వ్యక్తుల పేర్లను గత నాలుగు రోజులుగా వేర్వేరు ప్రకటనల్లో ఎంహెచ్ఎ పేర్కొంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్), పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్)లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదులుగా పేర్కొన్న వారిలో టిఆర్ఎఫ్కు చెందిన షేక్ సజ్జాద్ గుల్, లష్కరే తోయిబా కమాండర్ మహ్మద్ అమిన్ కుబాబ్, అదే సంస్థకు చెందిన అర్బాజ్ అహ్మద్ మిర్, కాశ్మీరీ యువతను రెచ్చగొడుతున్న అసిఫ్ మక్బూల్ దర్ ఉన్నారు. వీరిలో అర్బాజ్ అహ్మద్ మిర్ కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తున్నట్లు ఎంహెచ్ఎ పేర్కొంది. కొన్ని నెలల క్రితం కుల్గాంలో టీచర్ రజిని బాల హత్య కేసులో కుట్రదారుగా తెలిపింది.