Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ నిబంధనల రూపకల్పనకు కేంద్రం
- ఈ విధంగా పొడగింపును కోరటం ఇది ఏడోసారి
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద నిబంధనల రూపకల్పనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో ఆరు నెలల గడవు పొడిగింపును కోరింది. ఈ విధంగా పొడిగింపును కోరడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. 2019 ఏడాది ముగింపు నాటికి పార్లమెంటు ఉభయ సభల్లో సీఏఏ ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసింది. పౌరులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా బిల్లు నుంచి తమను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ముస్లిం ప్రజలు తీవ్ర ఆందోళనలు సైతం చేశారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ విషయంలో ఏకపక్షంగా ముందుకు వెళ్లి బిల్లును ఆమోదించుకున్నదని సామాజికవేత్తలు, నిపుణులు ఆరోపించారు. అయితే, చట్టం విషయంలో మొండిగా ముందుకెళ్లిన మోడీ సర్కారు.. నిబంధనల రూపకల్పనలో ఆలస్యం చేయడం వలన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఉన్నటువంటి అక్కడి మైనారిటీలు ఆ దేశంలో పౌరసత్వం పొందలేక.. ఇక్కడి పౌరసత్వం రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాజ్యాంగ నిపుణులు తెలిపారు. నిబంధనలు రూపొందించకుండా చట్టల అమలు చేయలేమన్నారు. చట్టం ఆమోదం పొంది మూడేండ్లయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుకు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వలన పాకిస్థాన్లో పౌరసత్వం పొందలేని 800 మంది తమ సొంత దేశానికి పంపబడ్డారని వివరించారు.