Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
- కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
- 8 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు.. సన్నద్ధం కండి : బండి
న్యూఢిల్లీ /నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
19న ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ పర్యటనలో రూ.7వేల కోట్ల ప్రాజెక్టు లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 19న ఉదయం 10 గంటలకు ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభి స్తారు. అనంతరం రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని అక్కడ రూ.1,850 కోట్ల వ్యయంతో 150 కిలో మీటర్ల పొడవున నిర్మించనున్న మూడు జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేట్ లో నిర్మించనున్న 'రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునుకు' భూమిపూజ చేయనున్నారు.
అనంతరం రూ.1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య 85 కిలో మీటర్ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేయ నున్నారు. ఐఐటీ హైదరాబాద్ నందు రూ.2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు కేసీఆర్ సిద్ధమేనా
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేం దుకు ఈ నెల 19న హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటనను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో మోడీ పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గౌతమ్ రావు, బొక్క నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడు తూ..కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధు లను మంజూరు చేస్తే ఆయా నిధులను తస్క రించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో సహా అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మల్లారెడ్డికి ఆరు లక్షల రూపాయల రైతు బంధు : మాజీ ఎంపీ బూర
మంత్రి మల్లారెడ్డికి ఆరులక్షల రూపాయల రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదనీ, అలాంటి వ్యక్తులకు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ సర్కారు సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు.