Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో 30లక్షల మంది కార్మికులకు లబ్ది
- చేరువకానున్న సంక్షేమ ఫలాలు
- దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు
కార్మిక,కర్షక, శామిక జనాన్ని మోడీ ప్రభుత్వం గాలికొదిలేస్తోంది..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అండగా నిలుస్తుంటే...కేరళలోని వామపక్ష ప్రభుత్వం బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కంకణం కట్టుకున్నది. కార్మికులకు సంక్షేమ ఫలాలు అందేలా సంక్షేమబోర్డు ఏర్పాటు చేసింది. దీన్ని పకడ్బందీగా అమలు
చేసేలా కార్యాచరణ రూపొందించింది.
దీంతో కార్మికవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ : కేరళలో ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రంగా కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఉపాధి హామీ చట్టం వర్తిస్తున్న దాదాపు 30 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సేవలు పొందటం సులభతరమ వుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ వీరికి వర్తిస్తాయి. పెన్షన్లు, ప్రభుత్వం నుంచి విద్యా సాయం, వైద్య సహాయం, కుటుంబ పెన్షన్లు...మొదలైనవి అర్హులైన కార్మికులందరికీ అందుతాయి. సంక్షేమబోర్డు ఛైర్మెన్‌గా నరేగా కార్మికుల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నాయకుడు ఎస్.రాజేంద్రన్‌ను నియమించింది. ''ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంక్షేమ కార్యక్రమాల్ని కార్మికులకు మరింత చేరువచేసేందుకే బోర్డును ఏర్పాటుచేశా''మని చెప్పారు. 60ఏండ్లు పూర్తిచేసుకున్న కార్మికులకు పెన్షన్లు పొందుతారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి నగదు సాయం అందుతుంది. మహిళా కార్మికులకు మరిన్ని అదనపు ప్రయోజనాలు అందజేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి హామీ చట్టం కింద అమలవుతున్న నరేగా పథకం, అయ్యాన్కలి అర్బన్ ఎంప్లారుమేంట్ గ్యారెంటీ పథకంలో రిజిష్టర్ అయిన కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ప్రయోజనాలు అందుతాయని ఎల్డీఎఫ్-1 ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సంక్షేమ బోర్డు ఏర్పాటుచేస్తున్నామని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. కోవిడ్-19 సంక్షోభంతో బోర్డు ఏర్పాటు ఆలస్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.