Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే ఐదంచెలతో అత్యంత పటిష్టమైన భద్రతను కలిగి ఉండే భారత ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడింది. కర్నాటకలోని ఒక రోడ్‌షోలో ఎస్యూవీ రన్నింగ్ బోర్డుపై నిలబడి ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తుం డగా ఒక బాలుడు (11) ఆయన వైపు ఒక పూల మాలతో దూసుకొచ్చాడు. సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించి మరీ ప్రధానికి అతి దగ్గరగా వచ్చాడు. పూల మాలతో సత్కరించే ఉద్దేశంతోనే ఆ బాలుడు ప్రధాని వైపునకు వచ్చినట్టు తెలిసింది. అయితే, అప్రమత్తమైన ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది (ఎస్పీజీ) ఆ వ్యక్తిని నిరోధించింది. ఆ బాలుడిని అక్క డి నుంచి తీసుకెళ్లింది.
అనంతరం ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ తన రోడ్‌షోను కొనసాగించారు. 29 నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను గురువారం సాయంత్రం ప్రారంభించడానికి ముందు ఆయన ఈ రోడ్ షోను చేపట్టారు. ఏయిర్పోర్టు నుంచి కార్య క్రమం జరిగే రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు సాగిన ఈ రోడ్ షో లోనే భద్రతా వైఫల్యం బయట పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.