Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో న్యూ ఇయర్ తెల్లవారుజామున సుల్తాన్‌పురి నుంచి కంఝువాలా వరకు అంజలి అనే యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులుపై వేటు పడింది. ఆ ఘటన జరిగిన రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర హౌంమంత్రిత్వశాఖ ఢిల్లీ పోలీసు ఆధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసు అధికారులు 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అలాగే పిసిఆర్ వ్యాన్లు, పోలీస్ పికెట్ల పర్యవేక్షక అధికారులు నిర్లక్ష్యం వహించింనందుకు వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని మంత్రిత్వశాఖ ఆదేశించిందని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల యువతి మృతి చెందడంపై.. ప్రజాగ్రహం పెల్లుబికింది. దీంతో హౌంమంత్రిత్వశాఖ స్పెషల్ కమిషనర్ షాలినీ సింగ్ నేతత్వంలో విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా.. హౌంమంత్రిత్వశాఖ పోలీసు అధికారులను ఆదేశించింది.