Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను 'టీచర్' అని సంబోధించాలని కేరళ బాలల హక్కుల కమిషన్ పేర్కొంది. ఉపాధ్యాయులు పురుషులు లేదా మహిళలు ఎవరైనప్పటికీ.. 'సర్' అనో, 'మేడమ్ ' అనో సంబోధించడం కాకుండా 'టీచర్' అనే పిలవాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (కేఎస్సీపీసీఆర్) ఆదేశించింది. సర్, మేడమ్ అనే లింగ భేదం లేకుండా టీచర్ అని పిలవడమే సరైన పదమని కేఎస్సీపీసీఆర్ చైర్పర్సన్ కె.వి. మనోజ్ కుమార్, సభ్యుడు సి.విజరు కుమార్లతో కూడిన ధర్మాసనం విద్యాశాఖను ఆదేశించింది. ఈ విధంగా పిలవడంతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుందని అన్నారు. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుందని కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయుల మధ్య లింగ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.