Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌పై కసరత్తు
న్యూఢిల్లీ : బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక నిపుణులతో భేటీ అయ్యారు. శుక్రవారం నీతి అయోగ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలు శాఖల కీలక అధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ, సవాళ్లను ఇందులో చర్చించారు. దేశ వృద్థి రేటు 7 శాతం అంచనా వేయగా.. వృద్థి వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సలహాలు, సూచనలు కోరారు. 2022-23లో 7 శాతం వృద్ధి ఉండొచ్చని కేంద్ర గణంకాల శాఖ కార్యాలయం అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇంతక్రితం ఏడాది 8.7 శాతం వృద్థితో పోల్చితే ఆర్థిక వ్యవస్థ మందగించనుంది. 2022-23లో 8-8.5 శాతం వృద్థి ఉండొచ్చన్న ఇంతక్రితం ప్రభుత్వ అంచనాలతో పోల్చితే జీడీపీ భారీగా పడిపోనుంది. వృద్థి 6.8 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవల అంచనా వేసింది. అదే జరిగితే సౌదీ అరేబియా కంటే తక్కువ వృద్ధి చోటు చేసుకోనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల మొదటి భాగం ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంత విరామం తర్వాత మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి.