Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలో శనివారం ఉదయం ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ (ఎక్యూఐ) 337గా నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఎఎఫ్ఎఆర్) సమాచారం ప్రకారం ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో 357, పూసా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో 329, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 326గా ఎక్యూఐ నమోదయ్యాయి. అలాగే ఢిల్లీ ఐఐటీ చుట్టుపక్కల ప్రాంతంలో 337, మధుర రోడ్లో 349, లోధి రోడ్ ప్రాంతంలో 327గా ఏక్యూఐ నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో శనివారం ఉదయం 11.6 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత నమోదై నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అక్కడ చలిగాలులు వీస్తున్నట్టు ఐఎండీ పేర్కొంది. రాబోయే రెండు రోజులు 15, 16 తేదీల్లో వాయువ్య భారతదేశంలో చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని, మరోసారి గరిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. జనవరి 15న పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.