Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖలో భోగి మంటల వద్ద ప్రజ్వరిల్లిన 'ఉక్కు' నినాదం
భోగి పండగ వేళ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖ జిల్లాలో 'ఉక్కు' నినాదం మార్మోగింది. సంక్రాంతి వేడుకల్లో 'సేవ్ వైజాగ్ స్టీల్' పేరిట విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపును విశాఖ వాసులు అందిపుచ్చుకున్నారు. పౌర, ప్రజా, కాలనీ సంఘాలతోపాటు సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యాన వాడవాడలా శనివారం భోగి మంటల వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో కట్టెనూ భోగి మంటలో వేస్తూ 'సేవ్ వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు. కొన్నిచోట్ల ఫ్లకార్డులు ప్రదర్శించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉక్కునగరం, గాజువాక పారిశ్రామిక ప్రాంతాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.