Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ మతాన్ని రక్షించుకోండి
- శ్రీరామసేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ రెచ్చగొట్టే ప్రసంగం
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ అండదండల తో హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని హిందువుల్ని రెచ్చగొడుతున్నా యి. శ్రీరామసేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ హిందువులను రెచ్చ గొడుతూ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ''హిందువులంతా తమ తమ ఇండ్లల్లో కత్తులు దగ్గర పెట్టుకోవాలి. మీ మతాన్ని రక్షించుకోవాలి. ఈ దేశాన్ని, సోదరీమణుల్ని రక్షించుకోవాలి'' అంటూ కర్నాటకకు చెందిన హిందూత్వ నాయకుడు ప్రమోద్ ముథాలిక్ అన్నా రు. యడ్రావి పట్టణంలో జనవరి 13న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసం గిస్తూ ముథాలికా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారు. ''చీరల మధ్య కత్తుల్ని దాచొద్దు. ఇంటిలో అందరికీ కనిపించేలా వేలాడదీయండి. మీ ఇంట ఇది కనిపిస్తే..మీ ఇంటి అమ్మాయిని ఎవడైనా టచ్ చేసే ధైర్యం ఉంటుందా?'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదు. లోక్‌సభ ఎంపీ ప్రగ్నాసింగ్ ఠాకూర్ ఇటీవల ఇలాగే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తొలుత పోలీసులు ఎంపీపై ఫిర్యాదు నమోదు చేయలేదు. ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటం, సోషల్ మీడియాలో వైరల్ అయిన మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ''పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్కు ఆయుధ పూజ చేయటం లేదు. తుపాకులకు ఆయుధ పూజ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు కత్తులకు ఆయుధ పూజ చేయకూడదు. ఇండ్లల్లో కత్తులు ఎందుకు పెట్టుకోకూడదు? ట్రాక్టర్లకు, పుస్తకాలకు, పెన్నులకు ఆయుధ పూజ చేయటం కాకూండా, కత్తులకు చేయండి''అని సభకు వచ్చినవారిని రెచ్చగొట్టాడు. లవ్ జిహాద్‌ను దృష్టిలో ఉంచుకొని, మరొక మతాన్ని టార్గెట్ చేయాల్సిందిగా హిందువుల్ని రెచ్చగొడుతూ అతడి వ్యాఖ్యలున్నాయని ఆరోపణలు వెలువడ్డాయి. భజరంగ్ దళ్ మాజీ సభ్యుడైన ముథాలిక్ 2005లో శ్రీరామ్ సేనను ఏర్పాటుచేశాడు. మోరల్ పోలిసింగ్, పబ్‌లకు వెళ్లే యువతలపై, వాలంటైన్స్ డే జరుపుకొనే వారిపై దాడులు చేయటం ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నాడు.