Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్యసేన్
న్యూఢిల్లీ : అధికార బీజేపీకి ఎదురులేదని భావించటం పొరబాటని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్తసేన్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో (2024) ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. శనివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ''రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు డీఎంకే, సమాజ్‌వాదీ కీలకంగా వ్యవహరిస్తాయి. బీజేపీకి ఎదురునిలిచే పార్టీ లేదనే ఆలోచన సరైంది కాదు. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ కొత్త పొత్తులకు సిద్ధమవు తున్నాయి. మరోవైపు భారత్ విజన్‌ను అధికార బీజేపీ గణనీయంగా తగ్గించింది. ఈ సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోతే మంచిది కాదు. ఆ పార్టీకి బలంతోపాటు బలహీనతలున్నాయి. మిగతా పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తే...గట్టి పోటీ ఇవ్వొచ్చు''అని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. పార్టీ బలహీనపడిందని కాంగ్రెస్ తనకు తానుగా భావిస్తోందన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్‌లోని వివిధ వర్గాల విజన్‌ను కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లగలదని అన్నారు.
దేశంలో మెజార్టీ వాదాన్ని బలోపేతం చేసేందుకు, మైనార్టీల పాత్రను తగ్గించేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) మోడీ సర్కార్ తీసుకొచ్చిందని అమర్త్యసేన్ అన్నారు.