Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రుతుస్రావ' సెలవులు...
తిరువనంతపురం : దేశంలో విద్య, వైద్యం, టూరిజం వంటి రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న కేరళ.. మరో చరిత్రాత్మక నిర్ణయానికి వేదికగా మారింది. పీరియడ్స్ సమయంలో విద్యార్థినులు లీవ్ తీసుకునేందుకు ప్రత్యేకంగా 'రుతుస్రావ సెలవు' పేరుతో హాజరు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రతి సెమిస్టర్‌లోనూ విద్యార్థినులకు మెనిస్ట్రియేషన్ బెనిఫిట్ కింద హాజరులో రెండు శాతం మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. యూనివర్సిటీ రూల్ ప్రకారం.. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా 75శాతం హాజరు ఉండాలి. పరీక్షలకు హాజరు కావాలంటే ప్రతి సెమిస్టర్లో ఈ హాజరు శాతం తప్పనిసరి. అయితే అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న సందర్భంలో, మహిళా విద్యార్థినులకు మెన్స్ట్రేషన్ బెనిఫిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వీరికి మినిమం అటెండెన్స్ పర్సంటేజ్ 73 శాతానికి తగ్గినా ఫర్వాలేదు. ఈ విషయంపై యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 'ఫిమేల్ స్టూడెంట్స్‌కు మెన్స్ట్రేషన్ బెనిఫిట్స్ కావాలనే అభ్యర్థనలను వైస్-ఛాన్సలర్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి సెమిస్టర్లో మహిళా విద్యార్థులకు హాజరు మినహాయింపు 2 శాతం మంజూరు చేయాలని ఆదేశించారు.