Authorization
Fri March 21, 2025 08:45:41 am
- ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
భువనేశ్వర్: ఒడిశా కటక్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బడాంబ- గోపినాథ్‌పుర్ టీ-బ్రిడ్జిపైకి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇక్కడ భారీ వేడుకలు నిర్వహించారు. అయితే సామర్థ్యానికి మించి జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.