Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ : సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎర్ర గంగిరెడ్టికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కేసు ట్రయల్‌ను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది. నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని తెలిపింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని సూచించింది. డిఫాల్డ్ బెయిల్ రద్దు కాదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.