Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నిధులను సమీకరించే, తీవ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందించే లష్కరే తోయిబా తీవ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కిని భద్రతా మండలిలోని ఐఎస్ఐఎల్, అల్‌ఖైదా ఆంక్షల కమిటీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. గతేడాది జూన్, నవంబరు మధ్యలో లష్కరే, జైషే మహ్మద్ నేతలు ఐదుగురిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని భారత్, అమెరికా నుండి ప్రతిపాదనలు రాగా చైనా అడ్డగించింది. ఆ ఐదుగురిలో ఒకరే ఈ మక్కి. కాగా చైనా వైఖరిలో ఇప్పుడు మార్పు ఎందుకు వచ్చిందనే అంశంపై అధికారులు వ్యాఖ్యానించలేదు.