Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024 జూన్ వరకు పొడిగింపు..బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో పార్టీ బలపడినట్లు పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమాను వ్యక్తం చేసింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల వరకు పార్టీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా కొనసాగుతారని చెప్పారు.