Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ డివై చంద్రచూడ్ కు తెలంగాణ బార్ అసోసియేషన్ వినతి
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు నియామకాల్లో పారదర్శకత లేదని తెలంగాణ బార్ అసోసియేషన్ విమర్శించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చండ్రచూడ్, ఇతర కొలీజియం సభ్యులను తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి అందజేశారు. తెలంగాణ డంపింగ్ యార్డ్ కాదనీ, తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియానికి పంపిన పేర్లను రీకాల్ చేయాలని కోరారు. హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టు బార్ అండ్ అడ్వకేట్ అసోసియేషన్ నేత రఘునాధ్ మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఐదుగురు పేర్లను కొలీజియంకు పంపిందనీ, వారంతా హైకోర్టులో అసలు ప్రాక్టీస్ చేయని వాళ్లని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసి, రాష్ట్ర సాధన జరిగినప్పటికీ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కొలీజియం నిష్పక్షపాతగా వ్యవహరిస్తోందా? అని ప్రశ్నించారు. నియామకాలలో సామజిక న్యాయం లేదనీ, అగ్ర వర్ణాల నుంచే నియమాకాలు జరుగుతున్నాయని అన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరామని తెలిపారు.