Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్. కవితా దర్యాణి రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) నాలుగో స్నాతకోత్సవం గురువారం ఉదయం 11 గంటల కు మాసాబ్ ట్యాంక్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనున్న దని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ కవితా దర్యాణిరావు తెలిపారు. బుధ వారం హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి పాల్గొం టారని తెలిపారు. వారితో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూనివర్సిటీ ఛాన్సలర్ హౌదాలో ఆన్లైన్లో పాల్గొంటారని చెప్పారు. కాన్వొకేషన్ సందర్భంగా, ఆరు పీిహెచ్డీలు, 114 బంగారు పతకాలు, ఇతర డిగ్రీలకు 612 పతకాలు ప్రదానం చేస్తారని చెప్పారు. 331 పీజీ డిగ్రీలు,4,456 అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, మొత్తం 4,793 డిగ్రీలు ఇవ్వనున్నట్టు తెలిపారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, హానరిస్ కాసా, ఆర్కిటెక్ట్ బృందా సోమయకు, ప్రముఖ ఆర్కిటెక్ట్, కన్సర్వేషన్ స్పెషలిస్ట్ ప్రదానం చేస్తారన్నారు. ఆమె 2004లో ముంబైలోని సెయింట్ థామస్ కేథడ్రల్ పునరుద్ధరణకు యునెస్కో ఆసియా-పసిఫిక్ హెరిటేజ్ అవార్డు గ్రహీతని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా డిజైన్, సేవల కూడలిలో పనిచేస్తున్న ''100 గ్లోబల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డిజైన్'' వ్యక్తులలో ఒకరిగా ఎంపికైందని గుర్తుచేశారు. 2013లో ఆర్కిటెక్చర్ ఫ్యాకల్టీలో రెండు, ప్లానింగ్ ఫ్యాకల్టీ లో నాలుగు డాక్టరేట్లను సాధించారని తెలిపారు. సమావేశంలో జేఎన్ఏ ఎఫ్ఏయూ ఎవాల్యు యేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ కుమార్, డైరెక్టర్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎం వినోద్ గణేష్ పాల్గొన్నారు.