Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ 17వ మహాసభ ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు కె.సుబ్బారావు
బెంగుళూరు నుంచి నవతెలంగాణ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో అసమానతలు, ఆర్థిక అంతరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని సీఐటీయూ 17వ మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు కె.సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగుళూరులోని ప్యాలెస్గ్రౌండ్లోని కామ్రేడ్ రంజనా నిరులా, రఘునాథ్సింగ్ వేదికగా ప్రారంభమైన సీఐటీయూ మహాసభలో ఆయన ఆహ్వానసంఘం తరఫున ప్రసంగించారు. దేశం నేడు ఆర్థిక, పొలిటికల్, సామాజిక, సాంస్కృతిక రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ మత, కుల విభజన రాజకీయాలతో కార్మికులను, ప్రజలను చీల్చి రాజకీయ లబ్ది పొందుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఒక్క కొత్త పరిశ్రమనూ తేకపోగా ఉన్నవాటిని ప్రయివేటుపరం చేస్తూ పోతున్నదని విమర్శించారు. దేశంలో ప్రధాన సమస్యలపై కార్యాచరణ రూపొందించుకుని సీఐటీయూ పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగుళూరు నగరంలో స్వాతంత్య్రానికి ముందు, నెహ్రూకాలంలో పారిశ్రామికంగా ఏవిధంగా అభివృద్ధి చెందిందో వివరించారు. ఇండియాలో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ జరిగిన తొలి నగరం బెంగుళూరేనని చెప్పారు. బెంగుళూరు నగర చరిత్రను వివరించారు.