Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్
- మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్
- మూడు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసి
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ శాసనసభల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. నాగాలాండ్ శాసనసభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లీ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగుస్తుంది. మూడు రాష్ట్రాల్లోనూ 60 శాసనసభ స్థానాలున్నాయి. మొత్తంగా 180స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని తెలిపింది. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కి తెలియచేయ వచ్చు నని రాజీవ్ కుమార్ తెలిపారు. మూడు రాష్ట్రాలకుగాను 9,125 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 80 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనివేనని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగా లంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ, ఐపీఎఫ్టీ ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రె సివ్ పార్టీ, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి అధికారంలో వున్నాయి.