Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలని తీర్మానం ప్రవేశపెట్టిన ఏఆర్.సింధూ
- బలపర్చిన జాతీయ కార్యదర్శి చుక్కరాములు
శ్యామల్ చక్రవర్తి నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ఢిల్లీలో ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన కార్మిక, కర్షక ఐక్యతా ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభలో ఆ యూనియన్ జాతీయ కార్యదర్శి ఏఆర్.సింధూ తీర్మానాన్ని గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామిక హక్కులపై దాడులు తీవ్రతరం అయ్యాయని చెప్పారు. మహిళలపై అణచివేత పెరిగిపోతున్నదన్నారు. మరోవైపు కమ్యూనల్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పోతున్నదని విమర్శించారు. సేవ్ ఇండియా..సేవ్ పీపుల్..రీచ్ టూ అన్రీచ్..ఐక్యతాపోరాటం' నినాదాలతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సీఐటీయూ జాతీయ కార్యదర్శి చుక్కరాములు మాట్లాడుతూ..చలో ఢిల్లీ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో కృషి జరగాలని కోరారు. ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. వర్కింగ్ క్లాస్‌ను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదంలో సీఐటీయూతో పాటు ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ కూడా కీలక పాత్ర పోషించాలని కోరారు.