Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రాస్ ఓవర్ మ్యాచ్లో ఓటమి
- షూటౌట్లో గెలిచిన కివీస్
భువనేశ్వర్ : స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ నుంచి భారత్ జట్టు నిష్క్రమించింది. ఈ టోర్నిలో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాభవం చవిచూసింది. ఆదివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమంగా నిలిచిచాయి. దీంతో ఫలితం కోసం షూటౌట్ నిర్వహించగా 5-4తో న్యూజిలాండ్ విజయం సాధించింది. 48 ఏళ్ల భారత్ ప్రపంచకప్ టైటిల్ ఆశలపై నీళ్లు జల్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలి అర్థభాగం ముగిసే సరికి భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తరువాత న్యూజిలాండ్ రాణించడంతో రెండో అర్థ భాగం కూడా ముగిసే సరికి 3-3తో మ్యాచ్ టైగా నిలిచింది.