Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఐపీఎస్ జూలియో రిబీరో దానం
న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో తనకు వచ్చిన నానీ పాల్కివాలా అవార్డులో నగదును హక్కుల కార్యకర్త హర్ష మందర్‌కు చెందిన ఎన్జీవోకు దానం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. '' ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఏజెన్సీ హర్ష మందర్‌ను తన కార్యాలయానికి రమ్మని తాఖీదును ఇచ్చింది. అధికారానికి ఎవరో ఒకరు అడ్డుగా నిలవాలి. హర్ష మందర్ చేస్తున్న ట్టుగానే ప్రతి ఒక పౌరుడూ గొంతు విప్పాలి.
ఇలా చేస్తే ప్రభుత్వం దారిలోకి వస్తుంది'' అని రిబీరో అన్నారు. బాంబే బార్ అసోసియేషన్‌తో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 2021, సెప్టెంబర్‌లో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వసంత్ కుంజ్‌లోని హర్ష మందర్ ఇళ్లు, అడ్చినిలోని ఆయన కార్యాలయం, మెహ్రౌలీలో ఆయన సంస్థ సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ సహాయంతో ఏర్పాటు చేయబడిన చిల్డ్రన్స్ హోంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈడీ చర్యను ఆ సమయంలో 500 మందికి పైగా విద్యావేత్తలు, కార్యకర్తలు, మేధావులు ఖండించారు పద్మభూషన్ అవార్డు గ్రహీత కూడా అయిన రిబీరో ముంబయి పోలీసు కమిషనర్‌గా కూడా పని చేశారు. అలాగే, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు, సీఆర్పీఎఫ్ డీజీగా కూడా విధులు నిర్వర్తించారు. 1986, 1991 సంవత్సరాల్లో ఆయనపై రెండు సార్లు హత్యాయత్నాలూ జరిగాయి.