Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కర్నాటక హిజాబ్ నిషేధం కేసు విచారణ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి అప్పగిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ఆదేశాలు జారీచేశారు. హిజాబ్ వివాదంపై దాఖలైన తాజా పిటిషన్ల విచారణ త్రిసభ్య ధర్మాసనానికి ఆయన కేటాయించారు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించటం తమ హక్కుగా పేర్కొంటూ కర్నాటకకు చెందిన కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన సీజేఐ పై ఉత్తర్వులు జారీచేశారు. హిజాబ్ కేసు పూర్వాపరాలు సీజేఐ ముంగిట పిటిషనర్ల తరఫు న్యాయవాది మీనాక్షి అరోరా ప్రస్తావించారు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, దీనిపై విచారణ చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు..ప్రభుత్వ ఉత్తర్వులను ఆమోదించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాంశుధూలియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది. హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ గుప్తా సమర్థించగా, జస్టిస్ సుధాంశుధూలియా తిరస్కరించారు. కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వులు వివాదాస్పదమని తేల్చారు. హిజాబ్ ధరించట ంమా? లేదా? అన్నది వారి వ్యక్తిగతమైన హక్కుగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు 1:1గా రావటంతో ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. రిట్ పిటిషన్లు దాఖలుకావటంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వచ్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను విచారణ జరపటానికి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.