Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రోజులు సమయం కావాలని లేఖ
- పులివెందుల్లోనే సీబీఐ బృందం
- ఎంపీని అరెస్టు చేస్తారంటూ వదంతులు
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చినా కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరు కాలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నా నని, ఐదు రోజుల తర్వాత విచారణకు వస్తానని సీబీఐకి ఆయన లేఖ రాశారు. దీనిపై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే ఉత్కంఠ నెల కొంది. సీబీఐ బృందం పులివెందుల్లో నే మకాం వేసి దర్యాప్తు కొనసాగి స్తోంది. హైదరాబాద్ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం ఒకటి పులివెందులకు రానుందనే ప్రచారం తో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. ఐదు రోజుల పాటు సమయం ఇవ్వ కుండా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలనే పేరుతో పిలిచి అరెస్టు చేస్తారనే ప్రచారనే ప్రచారంతో అధికార వైసిపిలో ఉత్కంఠ రాజ్యమేలుతోంది. అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు ఇవ్వడం, ఆయన తండ్రి వైఎస్ భాస్క రరెడ్డి కోసం ఆరా తీయడం, భాస్కర రెడ్డి అందుబాటులో లేక పోవడంతో చర్చనీయాంశంగా మారింది. కేసు హైదరాబాద్‌కు మారాక వివేకా కేసు దర్యాప్తును సిబిఐ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ బృందం కిందిస్థాయి నిందితులను కొందరిని విచారించడం, మరికొందరిని అరెస్టు చేయడం, అప్రూవర్‌గా మార్చడం, పలువురు నిందితులను కోర్టుకు హాజరు పర్చడం తెలిసిందే. తాజా విచారణ నేపథ్యంలో అవినాష్‌రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని విచారణకు పిలవడంతో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టు భావిస్తున్నారు.