Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర గవర్నర్
ముంబయి : తన పదవికీ రాజీనామా చేయాలనుకు ంటున్నానని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలిపానని కూడా వెల్లడించారు. ఈ విషయాన్ని గవర్నర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ''సంఘ సంస్కర్తలు, వీర యోధులు పుట్టిన గడ్డ మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవకుడి (గవర్నర్)గా సేవలందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజల నాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. ఇటీవల ప్రధాని ముంబయి పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతో ఓ విషయాన్ని పంచుకున్నా. అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్టు చెప్పాను. నా శేష జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం, ఇతర వ్యాపకాలతో గడపాలనుకుంటున్నా. ప్రధాని మోదీ నాపై ఎప్పుడూ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలోనూ అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నా'' అని కోశ్యారీ వెల్లడించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోశ్యారీ అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించడం, మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం వంటి ఘటనలతో వార్తల్లో నిలిచారు.ఇటీవల కూడా యోధుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.