Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: జర్నలిస్టు రాణా అయూబ్‌పై మనీలాండరింగ్ కేసులో విచారణను జనవరి 31 తరువాత ఏ రోజుకు అయినా వాయిదా వేయాలని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘజియాబాద్ కోర్టు జారీచేసిన సమన్లకు వ్యతిరేకంగా అయూబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 31న విచారించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 'మేం ఈ కేసును జనవరి 31న విచారిస్తాం. ఈ లోగా ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు అవినీతి నిరోధక అంశంపై జనవరి 27న నిర్ణయించిన విచారణను జనవరి 31 తరువాత తేదీకి వాయిదా వేయాలని తెలిపింది. విచారణను ముగించలేనందున ఈ ఉత్తర్వు జారీ చేస్తున్నాం. సమయాభావం వల్ల తప్ప మెరిట్‌ల ఆధారంగా కాదు' అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదుకు సంబంధించి ఘజియాబాద్‌లోని ట్రయల్ కోర్టు అయ్యూబ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఫిర్యాదు ముంబయిలో తలెత్తినందున ఈడి ఢిల్లీ జోనల్ ఆఫీస్ ఈ విషయాన్ని విచారిస్తున్నందున ఈ అంశాన్ని విచారించే అధికారం యుపి కోర్టుకు లేదని వాదిస్తూ అయ్యూబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.