Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజరు నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రుకు చెందిన రూ.35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అలాగే అమిత్ అరోరాకు చెందిన రూ.7.68 కోట్లు, విజరు నాయర్‌కు చెందిన రూ.1.77 కోట్లు, దినేష్ అరోరాకు చెందిన రూ.3.18 కోట్లు, అరుణ్ పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్లు, ఇండో స్పిరిట్‌కు చెందిన రూ.14.39 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో రూ.2,873 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడి అధికారులు వెల్లడించారు.
నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులు సమీర్ మహేంద్రుడు, విజరు నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి, బినారు బాబు, శరత్ చంద్రారెడ్డిలను బెయిల్ పిటిషన్లను సిబిఐ ప్రత్యేక కోర్టు విచారించింది. బుధవారం వాదనలు ముగిశాయి. నిందితుల బెయిల్ పై ఫిబ్రవరి 9న తీర్పు ఇవ్వనుంది.