Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు బుధవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. 140 మంది కి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకా లు(పీపీఎం), 668 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకా లను ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు దక్కించు కున్న 140 మందిలో అత్యధికంగా 48 మంది సీిఆర్పీ ఎఫ్ పోలీసులున్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్ నుం చి 25, జార్ఖండ్ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి.
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు, 11 ప్రతిభా పతకాలు
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 11 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారాంకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. తెలంగాణలో విశిష్ట సేవలందించినందుకు గాను అనిల్ కుమార్ (ఏడీజీ), బంగి రామకష్ణ (అడిషనల్ కమాండెంట్, టీఎస్‌ఎస్పీ 12 బెటాలియన్)కు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించాయి. కాగా ఈ ఏడాది మరో 13 మంది అధికారులు పోలీసు ప్రతిభా పతాకాలకు ఎంపికయ్యారు. తరుణ్ జోషి (వరంగల్ పోలీసు కమిషనర్), పేర్ల విశ్వ ప్రసాద్ (జాయింట్ పోలీసు కమిషనర్, స్పెషల్ బ్రాంచ్, హైదరాబాద్), గంగసాని శ్రీధర్ (ఏసీపీ, సైబర్ క్రైం), పి.నర్సింహ (డీఎస్పీ, రీజినల్ ఇంటలిజెన్స్), ఆర్.అరుణ్ రాజ్ (డీఎస్పీ, బేగంపేట్), జి వెంకటేశ్వర్లు(ఇన్‌స్పెక్టర్, సిటీ స్పెషల్ బ్రాంచ్), ఎం.శ్రీధర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, ఐటీ సెల్), ఎన్.ఎస్ జైశంకర్ (ఏఆర్‌ఎస్‌ఐ, 3 బెటాలియన్), కరుకొండ దయశీల (ఆర్‌ఐ, వరంగల్), జి.అచ్యుత రెడ్డి (ఏఏసీ గ్రేహౌండ్స్), ఎన్ రాందేవ్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, ఇంటలిజెన్స్), వీర రామాంజనేయులు (ఏఆర్ ఎస్‌ఐ, ఇంటలిజెన్స్), బి.వి.సన్యాసిరావు (ఇన్స్‌పెక్టర్, టీఎస్పీఎస్ హైదరాబాద్)లకు పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి.